విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటేజేషన్ ను నిరాకరిస్తూ ప్రారంభమైన ఉద్యమం 500 రోజులకు చేరుకుంది. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును ఎవరికో అమ్మేస్తామంటే ఊరుకునేది లేదంటూ ఉద్యోగ, కార్మిక సంఘాలు మహా ధర్నాకు దిగాయి. స్టీల్ ప్లాంట్ నుండి వైజాగ్ సిటీ వరకూ బైక్ ర్యాలీ ని నిర్వహించారు. జీవీఎంసీ దగ్గర ధర్నా చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది.